కార్టిసాల్ హార్మోన్ మీలో ఎక్కువగా ఉందా..?
మన శరీరం నిత్యం అనేక రకాల హార్మోన్లను ఉత్పత్తి చేస్తూ ఉంటుంది. వాటిలో కార్టిసాల్ అనే హార్మోన్ కూడా ఒకటి. దీనిని ఒత్తిడి హార్మోన్ అని కూడా అంటారు. మన శరీరం భయానికి, ఒత్తిడికి గురైనప్పుడు ఈ హార్మోన్ విడుదల అవుతుంది. దీనివల్ల నడుము చుట్టూ కొవ్వు పేరుకుపోతుంది. ఎల్లప్పుడూ నీరసంగా ఉంటుంది. నిద్రలేమి సమస్య తలెత్తుంది.