కింతలవానిపేటలో కానిస్టేబుల్ అంత్యక్రియలు
VZM: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కానిస్టేబుల్ టి.తిరుపతిరావు అంత్యక్రియలు గురువారం స్వగ్రామం కింతలవానిపేటలో జరిగాయి. ఈ మేరకు రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తిరుపతిరావు మృతదేహంపై పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బొబ్బిలి డీఎస్పీ భవ్య రెడ్డి, గజపతినగరం సీఐ రమణ, ఎస్సై కిరణ్ కుమార్ నాయుడు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.