VIDEO: జాతీయ జెండా ఆవిష్కరించిన పాలకుర్తి ఎమ్మెల్యే

JN: 79వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి తన క్యాంప్ కార్యాలయంలో జాతీయ జెండాను ఎగరవేశారు. ఈ సందర్భంగా స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకున్నారు. ప్రజా సంక్షేమం, అభివృద్ధి, మహిళా సాధికారత కోసం కృషి చేస్తానని ఆమె హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.