VIDEO: ఆదిలాబాద్‌లో వర్షం.. చల్లబడ్డ వాతావరణం
ఆదిలాబాద్ జిల్లాలో శనివారం సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. జిల్లాతో పాటు గుడిహత్నూర్, మావల మండలాల్లో సైతం వాన పడటంతో వేడి నుంచి ప్రజలకు ఉపశమనం లభించింది. అకాల వర్షాలకు మొక్కజొన్న, శనగ పంటకు నష్టం వాటిల్లే అవకాశము ఉందని అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.