వార్డు అభ్యర్థి విష్ణువర్ధన్ రెడ్డి ఏకగ్రీవం
WGL: జిల్లా కేంద్రంలో నెక్కొండ మండలం మేజర్ గ్రామ పంచాయతీ 8వ వార్డు కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి చల్ల విష్ణువర్ధన్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు అధికారులు ప్రకటించారు. ఈ తొలి విజయం కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నింపింది. ఏకగ్రీవం వార్త తెలిసిన వెంటనే స్థానిక కార్యకర్తలు ఆనందోత్సాహాలతో సంబరాలు జరుపుకొన్నారు.