చెరువులో ఆక్రమణలను తొలగించిన హైడ్రా

చెరువులో ఆక్రమణలను తొలగించిన హైడ్రా

RR: గండిపేట మండలం నెక్నాంపూర్ గ్రామంలోని చిన్నచెరువులో ఆక్రమణలను హైడ్రా తొలగించింది. చెరువు FTL, బఫర్ జోన్‌లలో పూజ క్రాప్టెడ్ హోమ్స్ నిర్మాణ సంస్థ నిర్మించిన షెడ్డులను నేలమట్టం చేసింది. దాదాపు రెండున్నర ఎకరాల మేర మట్టిని నింపి, రహదారులు వేసి చేపట్టిన కట్టడాలను తొలగించింది. నిర్మాణ సంస్థ యజమానులపై అధికారులు PSలో ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది.