బోనకల్‌లో రేపు విద్యుత్ నిలిపివేత

KMM: బోనకల్ సబ్ స్టేషన్ పరిధిలో శనివారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని ఏఈ మనోహర్ ఓ ప్రకటనలో తెలిపారు. సబ్ స్టేషన్ మెయింటినెన్స్ నిర్వహణ కారణంగా సబ్ స్టేషన్ పరిధిలోని అన్ని గ్రామాలలో ఉ.8 గంటల నుంచి ఉ.10 గంటల వరకు విద్యుత్ సరఫరాను నిలిపివేయడం జరుగుతుందని చెప్పారు. ఈ విషయాన్ని ప్రజలు గమనించాలని పేర్కొన్నారు.