బ్రహ్మోత్సవాల్లో భారీ భద్రత
ప్రకాశం: రాచర్ల మండలంలోని శ్రీనెమలిగుండ్ల రంగనాయకస్వామి బ్రహ్మోత్సవాలకు 340 మంది సిబ్బందిని నియమించినట్లు ఎస్పీ హర్షవర్ధన్ రాజు తెలిపారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఎక్కువ మంది సిబ్బందిని నియమించినట్లు తెలిపారు. బ్రహ్మోత్సవాలకు 5 మంది సీఐలు,14 మంది ఎస్సైలు, 320 మంది సిబ్బందిని నియమించారు.