సమ్మక్క–సారలమ్మ మహా జాతరకు ముహూర్తం ఖరారు
MLG: తాడ్వాయి మండలంలోని మేడారంలో జరిగే సమ్మక్క–సారలమ్మ మహా జాతరకు సోమవారం ముహూర్తం ఖరారైంది. జనవరి 14న గుడిమేలిగే పండుగ, జనవరి 21న మండమెలిగే పండుగతో ఉత్సవాలు ప్రారంభమవుతాయి. జనవరి 27 నుంచి దేవతల రాక కార్యక్రమాలు జరగగా, జనవరి 31న దేవతల వన ప్రవేశంతో ప్రధాన జాతర ముగుస్తుంది. ఫిబ్రవరి 4న తిరుగువారం పండుగతో మహా జాతర ఉత్సవాలు ముగియనున్నాయి.