'సీఎం చీరాల పర్యటన రద్దు'
BPT: సీఎం చంద్రబాబు శనివారం చీరాల పర్యటన రద్దైనట్లు కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ ఇవాళ ఓ ప్రకటనలో తెలిపారు. అయితే, ఈ నెల 28న స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంద్ర కార్యక్రమంలో సీఎం పాల్గొనవలసి ఉండగా, అదే రోజు అమరావతిలో ప్రత్యేక అసెంబ్లీ సమావేశం ఉండటంతో ఈ పర్యటన రద్దైనట్లు పేర్కొన్నారు. జిల్లా ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు.