హాథిరాంజీ మఠంను పాత తరహాలోనే పునర్నిర్మిస్తాం: కలెక్టర్

హాథిరాంజీ మఠంను పాత తరహాలోనే పునర్నిర్మిస్తాం: కలెక్టర్

TPT: హాథిరాంజీ మఠంను పాత తరహాలోనే పునర్నిర్మిస్తామని తిరుపతి కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. హాథిరాంజీ మఠం నందు బంజారాలకు మొదటి ప్రధాన్యతతో వారికి కావలసిన సదుపాయాలు కల్పిస్తామని వెల్లడించారు. ఈ మేరకు మఠంను మొత్తంగా కూల్చివేస్తారనే అపోహలు వద్దన్నారు. కాగా, హాథిరాంజీ మఠం పునర్నిర్మాణం కొరకు ప్రతిపాదనలను త్వరితగతిన సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపాలని కమిటీ సభ్యులను ఆదేశించారు.