పొట్టి శ్రీరాములకు నివాళులర్పించిన మంత్రి సవిత

పొట్టి శ్రీరాములకు నివాళులర్పించిన మంత్రి సవిత

సత్యసాయి: పెనుకొండలోని మంత్రి సవిత తన క్యాంపు కార్యాలయంలో ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకై ప్రాణత్యాగం చేసిన మహానీయుడు పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా ఆయన చిత్ర పటానికి స్థానిక నాయకులతో కలిసి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. మాట్లాడుతూ.. తెలుగురాష్ట్ర సాధన కోసం ప్రాణాలు అర్పించిన పొట్టి శ్రీరాములు జీవితం అందరికీ ఆదర్శం, ఆయన త్యాగం చిరస్మరణీయం అన్నారు.