ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా ఎన్నికల అధికారి
NRML: మామడ మండలంలోని ఎంపీడీఓ కార్యాలయంలో గ్రామ పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లను జిల్లా సాధారణ పరిశీలకులు ఆయేషా మస్రత్ ఖానం గురువారం పరిశీలించారు. పోస్టల్ బ్యాలెట్ నిర్వహణ, బ్యాలెట్ పెట్టెల పరిస్థితిని తనిఖీ చేస్తూ ఎన్నికల విధులను పకడ్బందీగా నిర్వహించాలని అధికారులు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో సుశీల్ రెడ్డి,మండల అబ్జర్వర్ గంగాధర్‌లు పాల్గొన్నారు.