'పదో పరీక్షలకు జిల్లాలో కట్టుదిట్ట భద్రత'

'పదో పరీక్షలకు జిల్లాలో కట్టుదిట్ట భద్రత'

నంద్యాల జిల్లా వ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు సజావుగా జరిగేలా కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ సునీల్ షౌరాణ్ ఆదివారం తెలిపారు. జిల్లాలోని 130 పరీక్ష కేంద్రాల వద్ద అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ఠ చర్యలు తీసుకున్నామని వెల్లడించారు. స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద భద్రతతో పాటు పరీక్ష కేంద్రాల పరిసరాల్లో 144 సెక్షన్ అమల్లో ఉంటుందని పేర్కొన్నారు.