'జిల్లాలో శిశు మరణాలను పూర్తిగా అరికట్టాలి'

'జిల్లాలో శిశు మరణాలను పూర్తిగా అరికట్టాలి'

ELR: జిల్లాలో మాతృ, శిశు మరణాలను పూర్తిగా అరికట్టాలని కలెక్టర్ వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో నిర్వహించిన సమీక్షలో ఆమె మాట్లాడుతూ.. వైద్య, ఐసీడీఎస్ విభాగాలు సమన్వయంతో పనిచేసి మరణాల సంఖ్యను సున్నాకు తీసుకురావాలన్నారు. జనవరి నుంచి మార్చి వరకు నమోదైన మరణాలపై మెడికల్ ఆడిట్ నిర్వహించాలని, విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవన్నారు.