'పాలనలో తేడాను గుర్తిస్తున్నారు'

CTR: ప్రస్తుత ప్రభుత్వం, గత వైసీపీ ప్రభుత్వ పాలనకు ప్రజలు తేడా గుర్తిస్తున్నారని పుంగనూరు మున్సిపల్ ఛైర్మన్ అలీం బాషా అన్నారు. ఈ మేరకు పుంగనూరు కుమ్మర వీధి, తూర్పుమొగసాల, మహబూబ్ నగర్ ప్రాంతాల్లో 'బాబు షూరిటీ - మోసం గ్యారంటీ' కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. కాగా, గత ప్రభుత్వంలో సంక్షేమ పథకాల క్యాలెండర్ ప్రకటించి తూచ తప్పకుండా జగన్ వాటిని అమలు చేశారని తెలిపారు.