సీఆర్.రెడ్డి కాలేజీలో 'డ్రగ్స్ వద్దు బ్రో' కార్యక్రమం

సీఆర్.రెడ్డి కాలేజీలో 'డ్రగ్స్ వద్దు బ్రో' కార్యక్రమం

ఏలూరు: సీఆర్.రెడ్డి కాలేజీ గ్రౌండ్‌లో రెవెన్యూ, ఎక్సైజ్, ఈగిల్ టీమ్, పోలీస్ శాఖల సంయుక్త ఆధ్వర్యంలో 'నషా ముక్తి భారత్ అభియాన్' కార్యక్రమం నిర్వహించారు. ఎస్పీ ప్రతాప్ శివకిషోర్, కలెక్టర్ వెట్రిసెల్వి, ఎమ్మెల్యే బడేటి చంటి, పాఠశాలలు, కాలేజీల విద్యార్థులు పాల్గొన్నారు. మాదక ద్రవ్యాలు యువత భవిష్యత్తును నాశనం చేస్తాయని ఎస్పీ హెచ్చరించారు.