ఎమ్మెల్యే రేపటి పర్యటన వివరాలు

JN: పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి రేపు పాలకుర్తి, కొడకండ్ల, దేవరుప్పుల మండలాల్లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న పనుల జాతరలో పాల్గొంటారు. కాగా మైలారం, ముత్తారం, ఏడునూతుల, నర్సింగ్ తండా, కొలుకొండ, నిర్మలతో పాటు పలు గ్రామాల్లో పాల్గొని పనుల జాతర పనులను ప్రారంభించనున్నారు.