VIDEO: రైతు వేదిక వద్ద యూరియా బస్తాల కోసం క్యూలైన్‌లు
WGL: నల్లబెల్లి మండల కేంద్రంలోని రైతు వేదిక వద్ద యూరియా బస్తాల టోకెన్ల కోసం రైతులు భారీగా తరలివచ్చారు. ఉదయం మొదలు పెట్టిన క్యూలైన్ మధ్యాహ్నం వరకు కొనసాగింది. వర్షాల సీజన్‌లో పంటలకు ఎరువుల కొరత ఏర్పడడంతో రైతులు ముందుగానే టోకెన్లు పొందేందుకు గంటల తరబడి వేచి ఉన్నట్లు రైతులు తెలిపారు. అధికారులు స్పందించి రైతుకు సరిపడా యూరియా అందించాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.