కన్న కూతురిపై తండ్రి అత్యాచారయత్నం

GNTR: తాడికొండ మండలంలో మద్యం అలవాటు ఉన్న తండ్రి తన 16 ఏళ్ల కూతురిపై అసభ్యంగా ప్రవర్తించిన సంఘటన బుధవారం వెలుగులోకి వచ్చింది. హాస్టల్ నుంచి ఇంటికి తీసుకుని వచ్చి, గదిలో కూర్చోబెట్టి అత్యాచారానికి ప్రయత్నించగా, కూతురి కేకలు విన్న పక్కింటివారు అడ్డుకున్నారు. తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.