చలో విజయవాడ జయప్రదం చేయాలి: FAPTO
VZM: ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కారం కోరుతూ ఈ నెల 17న నిర్వహించనున్న చలో విజయవాడ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఫ్యాప్టో నాయకులు కోరారు. నెల్లిమర్ల పట్టణంలో రామతీర్థం జంక్షన్‌లో ఫ్యాప్టో ఆధ్వర్యంలో శుక్రవారం ర్యాలీ నిర్వహించారు. వారు మాట్లాడుతూ.. ఉపాధ్యాయులకు బోధనేతర పనుల నుంచి విముక్తి కలిగించాలని కోరారు. 12వ పీఆర్‌సి ప్రకటించాలని కోరారు.