కబడ్డీ ఛాంపియన్ ధనుష్‌కు ఎర్రబెల్లి అభినందనలు
WGL: రాయపర్తి మండలం పన్యానాయక్ తండాకు చెందిన భూక్య ధనుష్ అండర్-20 స్టేట్ & నేషనల్ కబడ్డీ గోల్డ్ మెడల్ ఛాంపియన్‌గా నిలిచాడు. 2026లో ఇండోనేసియాలో జరగనున్న ఇంటర్నేషనల్ కబడ్డీ లీగ్‌లో పాల్గొనే అవకాశం పొందిన ధనుష్‌ను శనివారం హన్మకొండలో తన నివాసంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.