ఆఫీసుల్లో 50% వర్క్ ఫ్రమ్ హోమ్ తప్పనిసరి!
ఢిల్లీలో కాలుష్య తీవ్రత నేపథ్యంలో ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ కమిషన్(CAQM) నిబంధనలను సవరించింది. ప్రస్తుతం అమలులో ఉన్న GRAP-III కిందకే, అత్యంత కఠినమైన GRAP-IVలోని కొన్ని పరిమితులను తీసుకువచ్చింది. ప్రభుత్వ, మున్సిపల్, ప్రైవేట్ కార్యాలయాలు 50% సిబ్బందితో మాత్రమే పనిచేయాలని.. మిగిలినవారు ఇంటి నుంచే పని(WFH) చేసేలా నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది.