శ్రీరామనవమి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే
PLD: వెల్దుర్తి మండల కేంద్రంలోని రామాలయంలో శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని నిర్వహించిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి పాల్గొన్నారు. స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించి, తన సతీమణి శోభారాణి గారితో కలిసి సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని వేదోక్తంగా నిర్వహించారు.