రామప్ప దేవాలయాన్ని సందర్శించిన టీజీఎఫ్‌డీసీ జీఎం
MLG: వెంకటాపూర్ మండలం పాలంపేటలోని రామప్ప దేవాలయాన్ని టీజీఎఫ్‌డీసీ జీఎం జి స్కైలాబ్ సోమవారం సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు తీర్థప్రసాదాలు అందజేయగా, గైడ్ విజయ్ వారికి ఆలయ విశిష్టత వివరించారు. అనంతరం రామప్ప చెరువును సందర్శించి బోటింగ్ చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.