ప్రమాదకరంగా మారిన శానంపూడి రహదారి

ప్రకాశం: సింగరాయకొండలోని శానంపూడి రహదారి వర్షాల కారణంగా దెబ్బతిని ప్రమాదకరంగా మారింది. గుంతలలో నిలిచిన వర్షపు నీటితో రోడ్డు కనిపించక వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారు. అధికారులు వెంటనే రోడ్లకు మరమ్మతులు చేయాలని వాహనదారులు కోరుతున్నారు. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని స్థానికులు పేర్కొన్నారు.