విద్యుత్ శాఖ అధికారులతో ఎమ్మెల్యే సమీక్ష

విద్యుత్ శాఖ అధికారులతో ఎమ్మెల్యే  సమీక్ష

ప్రకాశం: కనిగిరిలోని అమరావతి గ్రౌండ్‌లో ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి శనివారం విద్యుత్ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ... నియోజకవర్గంలోని 6 మండలాల్లో విద్యుత్ సమస్యలు తలెత్తకుండా ప్రజలకు నాణ్యమైన విద్యుత్ సరఫరా జరిగేలా చూడాలని తెలిపారు. దెబ్బతిన్న విద్యుత్ స్తంభాల స్థానంలో నూతన స్తంభాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.