చండూరు మున్సిపల్ కో- ఆప్షన్ సభ్యుల ఎన్నికకు నోటిఫికేషన్
BHNG: చండూరు మున్సిపాలిటీలో ఇద్దరు కో- ఆప్షన్ సభ్యుల ఎన్నిక కోసం మున్సిపల్ కమిషనర్ మల్లేశం నోటిఫికేషన్ విడుదల చేశారు. రెండు స్థానాల్లో ఒకరు మహిళ అయి ఉండాలని పేర్కొన్నారు. ఇద్దరు సభ్యులు మున్సిపల్ కౌన్సిల్‌లో ఓటరు అయి ఉండాలని, 21 సంవత్సరాలలోపు వయస్సు ఉండరాదని తెలిపారు. ఈనెల 13వ తేదీ సాయంత్రం 5 గంటలకు నోటిఫికేషన్ వేయడానికి అవకాశం ఉందన్నారు.