బైక్‌ను ఢీకొన్న గుర్తుతెలియని వాహనం
ప్రకాశం: టంగుటూరు మండలం తూర్పునాయుడుపాలెం సమీపంలో ఆదివారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. తూర్పు నాయుడుపాలెం ఫ్లైఓవర్‌పై ఒంగోలు నుంచి టంగుటూరు వైపు వస్తున్న బైక్‌ను గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. దీంతో బైక్‌పై ప్రయాణిస్తున్న యువకులకు గాయాలు కాగా ఒంగోలులోని ఓ ప్రైవేటు వైద్యశాలలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.