'డివిజన్ పరిధిలో 1120 మంది ఎయిడ్స్ బాధితులు'
MDK: ఎయిడ్స్ రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సీహెచ్‌సీ డాక్టర్ లింబాద్రి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా డాక్టర్ మాట్లాడుతూ.. రామాయంపేట డివిజన్ పరిధిలోని ఐదు మండలాల్లో కలిపి మొత్తం 1120 మంది బాధితులు ఉన్నారని తెలిపారు. ఇందులో రామాయంపేటలో 400, చిన్న శంకరంపేటలో 350, చేగుంటలో 150, నార్సింగిలో 150, నిజాంపేటలో 120 మంది బాధితులు ఉన్నారని తెలిపారు.