జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం.. అధికారులు హెచ్చరిక

BHPL: భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా సోమవారం ఉదయం నుంచి భారీ వర్షం కురుస్తోంది. దీంతో జిల్లా ప్రజలు ఇండ్లకే పరిమితమయ్యారు. పలు మండలాల్లో వాగులు, చెరువులు నిండి మత్తడి పోస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు. కాగా, ప్రమాదకర ప్రాంతాల్లో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.