4 అంగుళాల అయోధ్య రామమందిరం

4 అంగుళాల అయోధ్య రామమందిరం

దేశవ్యాప్తంగా శ్రీరామనవమి సంబరాలు అంబరాన్నంటిన వేళ ప్రముఖ సూక్ష్మకళాకారుడు ఈశ్వర్ రావు తన భక్తిని చాటుకున్నారు. అయోధ్యలో నూతనంగా నిర్మించిన రామమందిరాన్ని తరపించేలా 4 అంగుళాల సూక్ష్మ నమూనాను తయారు చేశారు. ఈ మందిరం కేవలం 4 అంగుళాల ఎత్తు, 3 అంగుళాల వెడల్పు, 4 అంగుళాల పొడవు ఉంటుంది. దీనిని పూర్తి చేయడానికి తనకు ఏడు రోజుల సమయం పట్టిందని ఈశ్వర్ తెలిపారు.