ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వాక్సినేషన్ డ్రైవ్

ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వాక్సినేషన్ డ్రైవ్

కృష్ణా: మచిలీపట్నం తాళ్లపాలెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 15 సంవత్సరాల లోపు బాలికలకు హెచ్‌పీవీ వాక్సినేషన్ కార్యక్రమం ఇవాళ జరిగింది. గర్భాశయ క్యాన్సర్ నివారణలో భాగంగా ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమంలో వైద్యులు బాలికలకు టీకాలు వేశారు. బాలికల ఆరోగ్య రక్షణ కోసం ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న వ్యాక్సిన్‌ను సద్వినియోగం చేసుకోవాలని వైద్యులు సూచించారు.