ఈనెల 27, 28 తేదీల్లో తాగునీటి సరఫరాకు అంతరాయం

ఈనెల 27, 28 తేదీల్లో తాగునీటి సరఫరాకు అంతరాయం

GNTR: బీఆర్ స్టేడియం రిజర్వాయర్ పరిధిలో పైపులైను లీకేజీకి మరమ్మతు చేయాల్సి ఉన్నందున పలు ప్రాంతాలకు ఈనెల 27, 28 తేదీల్లో తాగునీటి సరఫరాకు అంతరాయం కలుగుతుందని కమిషనర్ శ్రీనివాసులు తెలిపారు. పాతగుంటూరు, ముగ్దూంనగర్, విజయశాంతినగర్, భగత్ సింగ్ నగర్, నాగలక్ష్మి నగర్, యానాది కాలనీ, దుర్గానగర్, ప్రియాంకగార్డెన్స్, ఆనందపేట, తదితర ప్రాంతాలకు అంతరాయం ఉంటుందన్నారు.