ఈ నెల 28న బండలాగుడు పోటీలు

ఈ నెల 28న బండలాగుడు పోటీలు

KDP: కలసపాడు మండలంలోని మహానందిపల్లెలో ఈ నెల 27 నుంచి శ్రీ వీరాంజనేయస్వామి ఆలయ తిరునాల నిర్వహిస్తున్నట్లు గ్రామ పెద్దలు తెలిపారు. 27న శ్రీసీతారాముల కల్యాణం, 28న శ్రీవీరాంజనేయస్వామి తిరునాల సందర్భంగా స్వామి వారి ఆలయంలో ప్రత్యేక పూజలు, కోలాటం, చెక్క భజన ఉంటాయన్నారు. అలాగే, ఎడ్లకు బండలాగుడు పోటీలు నిర్వహిస్తారన్నారు. ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు ఉంటాయన్నారు.