టెన్త్ విద్యార్థిని సూసైడ్

NLG: 10వ తరగతి పరీక్షలు సరిగా రాయలేదని మనస్తాపానికి గురైన ఓ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసుల వివరాలిలా.. కట్టంగూర్‌కు చెందిన చెరుకు పూజిత భార్గవి (15)స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతోంది. ఇప్పటికే తెలుగు, హిందీ, ఇంగ్లిష్ పరీక్షలు రాసింది. సోమవారం జరిగిన ఇంగ్లిష్ ఎగ్జామ్ సరిగా రాయలేదని మనోవేదనకు గురై ఇంట్లో ఉరి వేసుకుందని తెలిపారు.