కర్ణాటక మద్యం పట్టివేత ఇద్దరు మహిళలు అరెస్ట్

కర్ణాటక మద్యం పట్టివేత ఇద్దరు మహిళలు అరెస్ట్

కర్నూలు: కర్ణాటక మద్యం రవాణాపై శనివారం పోలీసులు దాడులు చేశారు. పట్టణంలోని ఏమ్మిగనుర్ బైపాస్ రోడ్ వద్ద దాడులు నిర్వహించగా.. ఆదోనికి చెందిన బోయ మానస, బోయ వీరేసమ్మలు తమ సంచులలో కర్ణాటక మద్యాన్ని రవాణా చేస్తుండగా పోలీసులు గుర్తించి అరెస్టు చేశారు. ఈ దాడులలో ఆదోని సెబ్ ఇనస్పెక్టర్ హరికృష్ణ, సిబ్బంది పాల్గొన్నారు.