జిల్లాలో ఇంకా నిండని సగం చెరువులు

MDK: మెదక్ జిల్లాలో ఇప్పటివరకు సగం చెరువులు మాత్రమే అలుగు పారుతున్నాయని ఇరిగేషన్ ఈఈ శ్రీనివాసరావు అన్నారు. జిల్లాలో మొత్తం 2,632 చెరువులున్నాయని, అందులో 25-50% 63, 50-75% 290, 75-100% 705 చెరువులు నిండాయన్నారు. 1574 చెరువులు అలుగులు పారుతున్నాయని వివరించారు. మెదక్ ప్రాంతంలో ఇంకా చెరువుల్లోకి నీరు రావాల్సిన అవసరం ఉందని వెల్లడించారు.