రోడ్ సర్వే పనులు నిలిపివేయాలని వినతి
NGKL: కల్వకుర్తి నియోజకవర్గంలోని ఎక్వాయిపల్లి, మర్రిపల్లి గ్రామాల పరిధిలో 330 ఫీట్ల వెడల్పు గల గ్రీన్ ఫీల్డ్ రోడ్డు సర్వే పనులు నిలిపివేయాలని రైతులు ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డికి శుక్రవారం వినతిపత్రం అందజేశారు. మాకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా పంట పొలాల గుండా సర్వే చేస్తున్నారని రైతులు పేర్కొన్నారు.