వంటగ్యాస్ ధరలను తగ్గించాలని రాస్తారోకో

వంటగ్యాస్ ధరలను తగ్గించాలని రాస్తారోకో

HNK: కేంద్ర ప్రభుత్వం పెంచిన వంటగ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని సీపీఎం మండల కార్యదర్శి వేలు రజిత అన్నారు. గ్యాస్ ధరలు తగ్గించాలని హసన్పర్తి మండల కమిటీ ఆధ్వర్యంలో హనుమకొండ–కరీంనగర్ ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న ప్రజావ్యతిరేక నిర్ణయాలు పేద, మధ్య తరగతి ప్రజలపై తీవ్ర భారంగా మారుతున్నాయని రజిత విమర్శించారు.