'పోలీస్ శిక్షణ కేంద్రాన్ని తనిఖీ చేసిన ఎస్పీ'

'పోలీస్ శిక్షణ కేంద్రాన్ని తనిఖీ చేసిన ఎస్పీ'

KDP: కడప నగర శివార్లలోని జిల్లా పోలీస్ శిక్షణా కేంద్రాన్ని గురువారం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు తనిఖీ చేశారు. శిక్షణా కేంద్రంలో పోలీస్ సిబ్బందికి ఎలాంటి కోర్సుల్లో శిక్షణ, ఫ్యాకల్టీ వివరాలు డి.టి.సి ఇన్‌స్పెక్టర్ వినయ్ కుమార్ రెడ్డిని అడిగి తెలుసుకున్నారు. కంప్యూటర్ ల్యాబ్, ప్రిన్సిపాల్ కార్యాలయం, పెరేడ్ గ్రౌండ్, జిమ్ తరగతి గదులను పరిశీలించారు.