ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు
ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 2026 చివరి నాటికి మోదీ ప్రధానమంత్రి పదవిలో ఉండకపోవచ్చు అని జోష్యం చెప్పారు. తనకున్న రాజకీయ అవగాహనతో ఈ విషయాన్ని చెబుతున్నానని వివరించారు. అమిత్ షాకు సైతం కాలం చెల్లిపోయిందని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బీజేపీ వాళ్ల పాలన ఇక నడవబోదని హెచ్చరించారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ మారాయి.