VIDEO: బస్సు అతివేగం.. మహిళకు తప్పిన గండం
GNTR: పెదనందిపాడు పాత బస్టాండ్ సెంటర్లో మంగళవారం ప్రమాదం చోటుచేసుకుంది. బస్సు కోసం వేచి ఉన్న మహిళను, అతివేగంతో వచ్చిన గుంటూరు-పర్చూరు ఎక్స్ప్రెస్ ఢీకొట్టింది. స్టాపులో ఆపకుండా దూసుకెళ్తూ డ్రైవర్ ఈ ప్రమాదానికి కారణమయ్యాడు. స్థానికులు గట్టిగా కేకలు వేయడంతో డ్రైవర్ బస్సు నిలిపాడు. దీంతో ఆ మహిళ తృటిలో ప్రాణాలతో బయటపడింది.