VIDEO: నాచారం ఇండస్ట్రియల్ రోడ్లపై నిర్మాణ వ్యర్థాల డంపింగ్
MDCL: నాచారం ఇండస్ట్రియల్ ప్రాంతంలో రోడ్లపై నిర్మాణ వ్యర్థాల డంపింగ్ పెరిగి తీవ్ర ఇబ్బందులు కలిగిస్తోంది. మట్టి, రాళ్లు, కాంక్రీట్ ముక్కలు ఎక్కడికక్కడ వేయడంతో రాకపోకలకు ఆటంకం ఏర్పడుతోంది. రోడ్లు సన్నగా మారి ట్రాఫిక్ సమస్యలు పెరుగుతున్నాయి. ధూళి కారణంగా కార్మికులు, స్థానికులు ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. అధికారులు స్పందించాలని స్థానికులు కోరుతున్నారు.