కనిగిరి డిపోలో శ్రమదానం

కనిగిరి డిపోలో శ్రమదానం

ప్రకాశం: కనిగిరి ఆర్టీసీ డిపో గ్యారేజీలో సోమవారం డిపో మేనేజర్ మహమ్మద్ సయనా బేగం ఆధ్వర్యంలో శ్రమదానం కార్యక్రమం నిర్వహించారు. డిపో పరిసరాలను శుభ్రంగా ఉంచేందుకు అధికారులు, డ్రైవర్లు, కండక్టర్లు, ఔట్ సోర్సింగ్ సిబ్బంది పాల్గొని స్వచ్ఛత కార్యక్రమంలో భాగమయ్యారు. డిపో మేనేజర్ మాట్లాడుతూ.. శ్రమదానం ద్వారా ఆరోగ్యకరమైన వాతావరణం ఏర్పడుతుందన్నారు.