మా వాళ్లని విడిపించడయ్యా..!
VZM: భోగాపురం మండలం కొండరాజుపాలెం సర్పంచ్ సూరాడ చిన్నా ఆధ్వర్యంలో మత్స్యకారులు విశాఖ కలెక్టర్‌ను కలిసి వినతి పత్రం అందజేశారు. బంగ్లాదేశ్ బోర్డర్‌లో ప్రవేశించడంతో 9 మందిని గత నెల 22న బంగ్లాదేశ్ కోస్ట్ గార్డ్ అరెస్టు చేసింది. అరెస్టు కాబడిన వారిలో సూరాడ అప్పలకొండ భార్య ఎనిమిది నెలల నిండు గర్భిణీగా ఉందని వెంటనే విడిపించేందుకు చొరవ చూపించాలని వారు కోరారు.