పీజీఆర్ఎస్‌కు 77 ఫిర్యాదులు

PLD: నరసరావుపేటలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో 77 ఫిర్యాదులు స్వీకరించారు. కుటుంబ, ఆర్థిక, ఆస్తి తగాదాలు, మోసం వంటి అంశాలపై వచ్చిన ఫిర్యాదులపై తక్షణ చర్యలు తీసుకోవాలని ఎస్పీ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మహిళలపై వేధింపులు, మోసపూరిత రిక్రూట్‌మెంట్ తదితర సమస్యలపై ఫిర్యాదులు అందాయని పోలీసులు తెలిపారు.