ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న టిప్పర్.. యువకుడి మృతి

ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న టిప్పర్.. యువకుడి మృతి

MHBD: నెల్లికుదురు మండలంలోని నర్సింహులగూడెం గ్రామానికి చెందిన వనగండ్ల వీరయ్య- పూలమ్మ దంపతుల కుమారుడు వనగండ్ల నరేష్(35) మంగళవారం ఆలేరుకు వెళ్ళొస్తున్నాడు. ఈ క్రమంలో ద్విచక్ర వాహనాన్ని టిప్పర్ ఢీకొనడంతో నరేష్‌కు తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు మానుకోట ఏరియా హాస్పిటల్‌కి తరలిస్తుండగా, మృతి చెందాడు. మృతుడికి భార్య, కూతురు, కుమారుడు ఉన్నారు.