బయోడిగ్రేడబుల్ కవర్లను పంపిణీ చేసిన KMC
ఖమ్మం గాంధీ చౌక్‌లో కేఎంసీ (KMC) ఆధ్వర్యంలో ప్లాస్టిక్ వినియోగాన్ని నిరోధించే లక్ష్యంతో అవగాహన కార్యక్రమం జరిగింది. ప్లాస్టిక్ కవర్ల వల్ల కలిగే పర్యావరణ, ఆరోగ్య సమస్యలపై ప్రజలకు అవగాహన కల్పించారు. దుకాణదారులకు బయోడిగ్రేడబుల్ కవర్లను వాడాలని సూచిస్తూ, ప్రతి షాపుకు ఒక కిలోగ్రాము బయోడిగ్రేడబుల్ కవర్లను ఉచితంగా పంపిణీ చేశారు.