VIDEO: విద్యార్థుల్లో దేశభక్తిని పెంపొందించాలి: చంద్రశేఖర ఆచార్య
SRD: భారతదేశ సంస్కృతి, దేశభక్తిని విద్యార్థుల్లో పెంపొందించాలని ప్రభుత్వ ఉపాధ్యాయుడు, సామాజిక సేవ కర్త చంద్రశేఖర ఆచార్య పేర్కొన్నారు. ఇవాళ ఖేడ్ పట్టణంలోని పాఠశాలలో జరిగిన శ్రీరామనవమి వేడుకల కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. విద్యార్థుల్లో చదువుతోపాటు క్రమశిక్షణ చాలా అవసరమన్నారు. అనంతరం రామాయణం కథలోని శ్రీరామచంద్రుని పరిపాలన, ప్రజల స్థితిగతులపై వివరించారు.